Advertisement

జబర్దస్త్ - నాగబాబు తో పాటు ఆది కూడా రీ ఎంట్రీ

Hyper Aadi Re Entry in Jabardasth

ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ నుంచి నాగబాబు ఎప్పుడో బయటికెళ్లిపోయారు. దర్శకులు నితిన్-భరత్ లకు సపోర్ట్ గా జీ ఛానల్ కి వెళ్లిన నాగబాబు ఆతర్వాత జబర్దస్త్ కి రాలేదు. అప్పుడప్పుడు గెస్ట్ గానే వెళ్లొచ్చారు. కొన్నేళ్లపాటు నాగబాబు, రోజా జెడ్జి లుగా జబర్దస్త్ షో ఓ వెలుగు వెలిగింది.

ప్రస్తుతం మసకబారిన జబర్దస్త్ షో ని పైకి లేపేందుకు మళ్లీ యాజమాన్యం నాగబాబు ని జెడ్జి గా తీసుకొచ్చింది. ఎమ్యెల్సీ గా బిజీ అవుతారనుకున్న సమయంలో నాగబాబు జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓల్డ్ కమెడియన్స్ మొత్తం జబర్దస్త్ వదిలేసారు. చంద్ర, ధనరాజ్, సుధీర్, ఆది, శ్రీను ఇలా అందరూ వెళ్లిపోయారు.

ఇప్పుడు నాగబాబు రీ ఎంట్రీ తర్వాత మళ్లీ పాత కమెడియన్స్ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేలా హైపర్ ఆది జబర్దస్త్ షో లో  కనిపించాడు. ఎప్పుడో జబర్దస్త్ ని వదిలేసి ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, సిల్వర్ స్క్రీన్ అంటూ బిజీ అయ్యాడు. ఇక తాజాగా వదిలిన జబర్దస్త్ ప్రోమోని చూస్తుంటే ఇందులో ఆది వేసిన పంచులు హైలెట్ అవుతున్నాయి.

ఆది టీం లీడర్‌గా అయితే ఈ ఎపిసోడ్‌లో కనిపించడం లేదు. మరి నిజంగా ఆది జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తున్నాడా, లేదంటే జస్ట్ ఈ ఒక్క ఎపిసోడ్ లనే కనిపిస్తాడా అనేది ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే గాని తెలియదు.

Aadi ,