మీడియా ప్రశ్న- మాళవిక మోహనన్ అసహనం

Malavika Mohanan Slams Media

కోలీవుడ్ లో విజయ్- త్రిష వ్యవహారం అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. విజయ్ తన భార్య సంగీత కు విడాకులు ఇచ్చిన మరుక్షణమే త్రిష ను వివాహమాడతారనే వార్తలు వండి వారుస్తున్నారు. తమిళ రాజకకీయాల్లో త్రిష-విజయ్ ప్రేమ కథ మరో ఎంజీఆర్-జయలలీత లు అవుతారనే మాట గట్టిగానే వినబడుతుంది.

ఇక ఎక్కడ సెలబ్రిటీస్ కనిపించినా మీడియా వారు విజయ్- త్రిష ల వ్యవహారం పై ప్రశ్నించకుండా వదలడం లేదు. తాజాగా విజయ్ తో మాస్టర్ మూవీలో నటించిన మాళవిక మోహనన్ ను మీడియా వారు.. విజయ్ సార్ వెళ్లే ప్రతి చోటుకీ త్రిష కూడా వస్తున్నారు, దీనిపై మీరేమంటారు అని అడిగారు. అప్పుడే ఈ ప్రశ్నపై మాళవిక అసహనం వ్యక్తం చేసింది.

ఆతర్వాత సోషల్ మీడియా వేదికగా.. కేవలం రేటింగ్స్ కోసం కొంతమంది జర్నలిస్టులు ఇలాంటి అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు, హీరో విజయ్ తనకు గత ఏడేళ్లుగా తెలుసని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన్ని ఒక మంచి స్నేహితుడిగా భావిస్తాను, అయితే ఫ్యూచర్ లో మీడియా సమావేశాలు గౌరవప్రదంగా సాగాలి కానీ, ఇలాంటి చెత్త ప్రశ్నల్తో కాదు అంటూ ట్వీట్ చేసింది. 

Malavika Mohanan Slams Media Over Distasteful Questions About Vijay,