ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan Arrived Before Alcohol, Sirish Clarifies

చరణ్ పై ట్రోల్స్-అల్లు శిరీష్ అదిరిపోయే రిప్లై

Ram Charan Arrived Before Alcohol, Sirish Clarifies

ఈమధ్యనే కవల పిల్లలకు తండ్రయిన రామ్ చరణ్ ఆపిల్లల బారసాల వేడుక పూర్తి కాగానే.. అయ్యప్ప మాల ధరించారు. ఎక్కువగా రామ్ చరణ్ అయ్యప్ప మాలలోనే కనిపిస్తారు. అయితే చరణ్ అయ్యప్ప మాలవేసుకుని అల్లు వారి పెళ్లి సంబరాల్లో ముఖ్యంగా ఆలు శిరీష్ పెళ్లి కోసం అల్లు అర్జు ఏర్పాటు చేసిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో కనిపించారు.

అదేమిటి ఎంతో నిష్ఠ తో చెయ్యాల్సిన అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి ఎలా వెళ్లారు.. అసలు ఇదేం పద్దతి అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ చరణ్ ట్రోలర్స్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

అసలు నిజమేమిటంటే రామ్ చరణ్ తన ప్రీ వెడ్డింగ్ పార్టీ మొదలు కాకముందే అక్కడికి చేరుకుని, తనని విష్ చేసారని, ఆయన కేవలం విష్ చేయడానికి మాత్రమే అక్కడికి వచ్చారని, అసలు ఆ సమయంలో అక్కడ ఎవరూ మద్యం సేవించలేదని, రామ్ చరణ్ కూడా గెస్ట్ గా వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారని చెప్పిన అల్లు శిరీష్..

అయ్యప్ప స్వామి అంటే చరణ్‌కు ఉన్న భక్తి శ్రద్ధలు వెలకట్టలేనివని, అటువంటి వ్యక్తి ఎప్పుడూ దైవభక్తిని కించపరచరు, ఆచారాలకు భంగం కలిగించరని శిరీష్ చెప్పుకొచ్చాడు. 

Ram Charan attends Allu Arjun pre-wedding bash wearing Ayyappa Mala

ram charan