సక్సెస్ ఫుల్ హీరో పారితోషికం ఆకాశంలో

Kiran Abbavaram

యంగ్ హీరోస్ అయినా స్టార్ హీరోస్ అయినా వారి వారి పారితోషికాలు వారి సక్సెస్ పైనే ఆధారపడి ఉంటాయి. నిర్మాతలైనా, దర్శకులైనా సక్సెస్ ఫుల్ హీరోల వెంట పడుతుంటారు. ఇప్పుడలా కుర్ర హీరో ఒకరు వరస విజయాలతో క్రేజీగా మారడంతో.. ఆయన పారితోషికం కూడా అమాంతం పెరిగింది అనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ హీరో ఎవరో కాదు Ka, K-Ramp చిత్రాలు వరుస విజయాలు సాధించిన కిరణ్ అబ్బవరం. కంటిన్యూ సక్సెస్ సక్సెస్ లతో అబ్బవరం మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కంటెంట్ ఆధారిత కథలను ఎంపిక చేసుకోవడంలో కిరణ్ అబ్బవరం మంచి పేరుంది. 

కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతల్లో పెరిగిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు ₹12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా ఒప్పందం కుదుర్చుకున్న ఆయన, ఆ ప్రాజెక్ట్‌కు సుమారు ₹12 కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకున్నారని సమాచారం.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. వరుస విజయాలతో ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరం రాబోయే రోజుల్లో మరింత స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Hero Kiran Abbavaram

kiran abbavaram