హైలేట్ అవ్వాలంటే తప్పదు తట్టుకోవాలి

Ram Charan Mobbed By Fans

సినిమా సెలబ్రిటీస్ అయినా, రాజకీయ నేతలైనా వారి చుట్టూ జనం ఉంటె తప్ప వారు శాటిస్ఫాయ్ అవ్వరు. వారు కొట్టే జేజేలు వీరికి కొండంత బలం. సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ ప్రెజెన్స్ కావాలి, రాజకీయనేతలకు ప్రజల ప్రెజెన్స్ కావాలి. అందుకే అభిమానులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. పబ్లిక్ లో కనిపిస్తే పిసికి పారేస్తున్నారు.

రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ని కారెక్కనివ్వకుండా ఇబ్బంది పెట్టారు అభిమానులు. ఆతర్వాత సమంత ను శారీ షాప్ ఓపినింగ్ లో తోసేశారు. ఇక తాజాగా రామ్ చరణ్ తమ కుమార్తె క్లింకార ను తీసుకుని పుట్టిన బిడ్డలను చూసేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చారు. ఇప్పటివరకు క్లింకార ఫేస్ రివీల్ చెయ్యని చరణ్ కి మీడియా వారు, అభిమానులు చుక్కలు చూపించారు.

రామ్ చరణ్ ఎంతగా క్లింకార ను దాచినా, క్లింకార కూడా తెలివిగా ఫేస్ ని దాచుకుంటున్నా ఎలాగో ఆమె ఫేస్ ని మీడియా రివీల్ చేసేసింది. దానితో రామ్ చరణ్ టీమ్ క్లింకార పాప ఫొటోస్, వీడియోస్ స్ప్రెడ్ చెయ్యొద్దు, పైరసీ కంటెంట్ అంటూ అలెర్ట్ అయ్యింది. మరి ఇదంతా ఎందుకు జరిగింది. అభిమానుల ఆరాటం, క్లింకార ను ఇపప్టివరకు చూపించకుండా అభిమానులను వెయిట్ చేయించినందుకే ఇలా జరిగింది అనేది వాస్తవం.

మరి అపోలో ఆసుపత్రికి రామ్ చరణ్, ఇంకా మెగా ఫ్యామిలీ వస్తుంది అంటూ మెగా పీఆర్ టీమ్ ఇస్తున్న అప్ డేట్స్ చూసి అపోలో కి అభిమానులు క్యూ కట్టారు. వెర్రి అభిమనం కదా.. అందుకే చరణ్ ని పాప ను చూడగానే రెచ్చిపోయి తొక్కేశారు. మరి అభిమానులు కావాలి, హైలెట్ అవ్వాలి అంటే ఓర్చుకోవాలి, అంతటి అభిమానం సంపాదించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఘటనలను లైట్ తీసుకోవాల్సిందే. 

Ram Charan 2-year-old daughter mobbed at hospital while visiting newborn twins

ram charan