అఫీషియల్: మెగా-అనిల్ ప్రాజెక్టులో నయనతార

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో క్రేజీగా మొదలు కాబోతున్న #Mega157 చిత్రానికి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకంటే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 300 కోట్ల బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో కనిపించడమే కారణం. అలాగే #Mega157 ఓపెనింగ్ ని కూడా అందరూ ఆశ్చర్యపడేలా చెయ్యడం వంటి విషయాలతో #Mega157 పై అంచనాలు, క్రేజ్ పెరిగిపోయాయి. 

ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార జోడి కట్టబోతుంది. గతంలో సైరా నరసింహ రెడ్డిలో చిరు భార్యగా, అలాగే గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ కి సిస్టర్ గా నటించిన నయనతార #Mega157 లో చిరు తో రొమాన్స్ చేయబోతుంది అనే వార్త వినిపించడం, ఈ ప్రాజెక్టు కోసం నయనతార భారీగా డిమాండ్ చేసింది అనే టాక్ వైరల్ అవడం చూసాం. 

ఇప్పుడు మే 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న #Mega157లోకి నయనతార హీరోయిన్ గా అఫీషియల్ గా అడుగుపెట్టబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. #Mega157 హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్టుగా మేకర్స్ వీడియో షేర్ చేసారు. నయనతార  #Mega157 షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న వీడియో ని షేర్ చేసారు. 

అంతేకాదు నయనతార ఆ వీడియో లో తెలుగు మట్లాడుతూ, మెగాస్టార్ సాంగ్స్ వింటూ #Mega157 లో నటిస్తున్న స్క్రిప్ట్ చదువుతూ, అనిల్ రావిపూడి తో కలిసి చేసిన సందడి మాత్రం వేరే లెవల్, అనిల్ రావిపూడినా మజాకానా అనేలా ఉందా వీడియో. 

Nayanthara Pairs with Chiranjeevi for Mega157

Nayanthara Onboard For Mega157
nayanthara