ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Manoj dharna in front of Mohan Babu house

మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ధర్నా

మంచు వారి ఇంటి తగాదా ఎప్పుడో రోడ్డుకెక్కింది. అన్నదమ్ముల వార్ కాస్తా తండ్రికొడుల వార్ గా మారింది. ఇప్పుడు మంచు మనోజ్ vs మోహన్ బాబు గొడవగా మారిపోయింది. గత ఆరు నెలలుగా మంచు వారి ఇంటి రచ్చ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. తాజాగా మనోజ్ మరోసారి జల్ పల్లి హౌస్ ముందు ధర్నా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

మంచు విష్ణు తన అనుచరులతో కలిసి తన కారు, ఇంకొన్ని వస్తువులను తీసుకెళ్లినట్టుగా మనోజ్ ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడమే కాదు, తనని ఇంట్లోకి రానివ్వడం లేదు అంటూ మోహన్ బాబు ఇంటి బయట కూర్చుని నిరసన తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం జల్ పల్లి మంచు మనోజ్ ఇంటిదగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. మనోజ్ ని ఇంట్లోకి రానీయకుండా అడ్డగించడంతో మంచు మనోజ్ గేట్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న మంచు టౌన్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

మీడియాని కానీ, మరెవ్వరిని కానీ మంచు టౌన్ వద్దకు పోలీసులు అనుమతించడం లేదు. మంచు టౌన్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు, కోర్ట్ తీర్పు మనోజ్ కు అనుకూలంగా ఉన్నా.. ఇంట్లో ఉండమని చెప్పినా..‌ పోలీసులు మనోజ్ ను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదు అని మనోజ్ ధర్నా చేస్తున్నాడు. 

Manchu Manoj Protest In Front Of Mohan Babu House

Manchu Manoj dharna in front of Mohan Babu house
manchu manoj
Advertisement
Advertisement