NTR-Neel కాంబో నుంచి బిగ్ అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం పై నిన్న సడన్ గా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు. ఈ రోజు 12 గంటలకు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ నుంచి అప్ డేట్ వస్తుంది అంటూ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసారు. ఇప్పటికే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోయింది. 

కానీ ఎన్టీఆర్ నీల్ సెట్స్ లోకి వెళ్ళలేదు, అటు వార్ 2 షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ దేవర జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొని హైదరాబాద్ కి వచ్చేసారు. అప్పటినుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లోకి ఎప్పుడు అడుగుపెడతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా దానికి సంబందించిన అప్ డేట్ ని మేకర్స్ పంచుకున్నారు. 

ఈ నెల అంటే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లోకి అడుగుపెడతారు, అప్పటి నుంచి #NTRNeel అత్యంత విస్ఫోటన దశలోకి ప్రవేశిస్తోంది అంటూ మేకర్స్ గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ వదిలారు. 

#NTRNeel is entering its most explosive phase 💥💥

Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️‍🔥❤️‍🔥

#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm అంటూ మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

NTR-Neel is entering its most explosive phase

Big update from NTR-Neel combo
ntr
Advertisement
Advertisement