కలర్ ఫుల్ మెహిందీ వేడుకలో కీర్తి సురేష్
Keerthy Suresh pre-wedding rituals begin with Antonyమలయాళ భామ కీర్తి సురేష్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా వీరిద్దరి మధ్య ఎక్కడా అనుమానాలు రాకుండా జాగ్రత్తగా తమ రిలేషన్‌షిప్‌ను నిర్వహించారు. తెరపై పలువురి హీరోలతో ప్రేమ కథలు ఉన్న కీర్తి సురేష్ తన మనసును మాత్రం ఆంటోనీకి ఇచ్చి వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచారు.
పెళ్లి అనంతరం కీర్తి తన స్నేహితుడితో కలిసి ఆడి పాడి ఆనందంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆంటోనీతో ఉన్న ఈ హ్యాపీ మూమెంట్స్ వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను అద్భుతంగా ప్రతిభింబిస్తుంది. ఈ జంట పక్షులలా కనిపిస్తున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ గురించి కొన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా బేబీ జాన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అవకాశాలు రాబట్టాలని భావించినా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తెలుగులో దసరా, భోళా శంకర్ చిత్రాలు చేసినప్పటికీ ఆమెకు కొత్త అవకాశాలు రాలేదు.
మహానటి సినిమాలో నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత కీర్తి సురేష్ తన కెరీర్‌ని మరింత వేగంగా ముందుకు నెట్టింది. అయితే హిందీ లో మొదటి సినిమాతో ఆశించిన ఫలితం రాలేదు. తమిళంలో మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్టార్ ఛాన్సులు రావడం సహజమే.
ఇప్పుడు తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు లేకపోయినా కీర్తి తన గ్లామర్ డోస్ పెంచి అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్‌లో గ్లామర్ పెంచడం వల్ల తన కెరీర్‌కు ప్రోత్సాహం వస్తుందని భావించినా తదుపరి అడుగులు ఏమిటన్నది తెలియడం లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఇచ్చే అప్డేట్స్‌తోనే ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.
Keerthy Suresh pre-wedding rituals begin with Antony Thattil in Goa







































