ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shristi Sharma in Channels-Johnny Master post viral

మీడియాలో శ్రేష్టి శర్మ-జానీ మాస్టర్ పోస్ట్ వైరల్

Shristi Sharma in Channels-Johnny Master post viral

జానీ మాస్టర్ వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి అతన్ని జైలుకు పంపించిన లేడీ అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ శ్రేష్టి శర్మ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. జానీ మాస్టర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడు, కాబట్టే తాను కేసు పెట్టాను, ఈ విషయంలో తన ఫ్యామిలీ సపోర్ట్ తనకు ఉంది, అతని చర్య వెనుక అతని భార్య ప్రమేయం కూడా ఉందని, ఆమె కూడా డ్రామాలు ఆడుతుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఎవరికి భయపడకుండా కేసు పెట్టినట్లుగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నాలుగేళ్ళ తర్వాత తాను బయటికి రావడం వెనుక కారణాలు కూడా చెప్పింది. నేను ఎప్పుడైతే.. ధైర్యంగా నిలబడి ఫైట్‌ చేయగలనో అప్పుడే బయటకు వచ్చాను. సమాజం గురించి ఆలోచించలేదు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను, రివేంజ్‌ కోసం ఆ కేసు పెట్టలేదని ఆమె స్పష్టం చేసింది. 

శ్రేష్టి శర్మ మీడియాలో ఇంటర్వూస్ ఇస్తున్న సమయంలో జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.

ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.

మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.

న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!! అంటూ సోషల్ మీడియాలో జానీ మాస్టర్ రాసుకొచ్చాడు. 

Shristi Sharma interview

shristi sharma