వైఎస్ జగన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారా?

Is YS Jagan in the danger zone?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డేంజర్ జోన్‌లో ఉన్నారా..? ఆయన చుట్టూ ఉన్నోళ్లే ఇబ్బంది పెడుతున్నారా..? అసలు ఎవర్నీ నమ్మడానికి లేదా..? అసలు ఎవరి మనోడో.. పరాయివాడో తెలుసుకోలేని, తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారా..? అంటే తాజా పరిస్థితులు, ఓ పెద్ద మనిషి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి..? జగన్‌కు ఏమైంది..? ఆ పెద్దాయన మాటల వెనుక ఆంతర్యమేంటి..? అనే ఇంట్రెస్టింగ్.. బాంబ్ పేల్చిన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఇంతకీ ఏం జరిగింది..?

పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. గుర్తున్నారా..? అదేనండోయ్ ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సీఐడీ తరఫున కేసులు వాదించారో ఆయనే.. ఈయన! ఇప్పుడు ఈయన ఎందుకు సీన్‌లోకి వచ్చారనేదేగా మీ సందేహం. అగో ఆ పైన చెప్పాం కదా పెద్దాయన అని.. ఆయన ఈయనే..! ఇదిగో వైఎస్ జగన్‌తో పాటు పొన్నవోలు కూడా లండన్ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా.. వైసీపీ కార్యకర్తలు,  జగన్ వీరాభిమానులను కలిశారు. లండన్‌లో ఉంటూ వైసీపీ కోసం కృషి చేసిన వారితో సమావేశం నిర్వహించిన పొన్నవోలు జగన్ గురించి మాట్లాడుతూ గుక్కపెట్టి.. వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్నోళ్లంతా ఏమైందబ్బా ఇంతగా ఎమోషనల్ అయ్యారని ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎంత ప్రమాదంలో ఉన్నాడో..?

వైఎస్ జగన్ చాలా ప్రమాదంలో ఉన్నారని పొన్నవోలు పదే పదే చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జగన్ చుట్టూ ఉన్నవాళ్లను ఎవర్ని నమ్మాలో.. అసలు ఎవరు మనోళ్లే.. ఎవరు పరాయివాళ్లో కూడా అర్థం కావట్లేదని చెప్పారు. అయినా సరే జగన్ మాత్రం గట్టిగానే ఒక్కడై ఫైట్ చేస్తున్నాడని.. ఆయన కష్టమేంటో తనకు బాగా తెలుసని చెబుతూ బోరుమని ఏడ్చేశారు. కాసేపు గ్యాప్ లేకుండా ఏడ్చేసిన పొన్నవోలు మళ్లీ తేరుకుని.. జగనన్నను కాపాడుకోవాలని మనందరం చేయాల్సింది ఇదేనని అక్కడున్న ఎన్నారైలకు సెలవిచ్చారు. జగన్ మిమ్మల్ని (ఎన్నారైలు, వీరాభిమానులు) పలకరించారా లేదా అన్నది పక్కనెట్టేయండి ఎందుకంటే వీలుపడని పరిస్థితులో ఉన్నారన్నారు. అందరూ ఏపీకి వచ్చేయండి పార్టీ చేసుకుందామని పిలుపునిచ్చారు. చూశారు కదా.. ఇదీ పొన్నవోలు చెప్పిన మాటలు. ఇక ఈ కామెంట్స్ విన్నాక, చూశాక.. మీ మనసులో ఏమనుకుంటారో మీ ఇష్టమిక..!

How much danger is Jagan?

jagan