అఫీషియల్: ఫ్యామిలీ ‌స్టార్ స్ట్రీమింగ్ డేట్

Family Star OTT Streaming Date Out

విజయ్ దేవరకొండ-పరశురామ్ కలయికలలో లేటెస్ట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ నిర్మాత దిల్ రాజు పెట్టుకున్న అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రం విజయ్ దేవరకొండని కూడా బాగా నిరాశపరిచింది. అద్భుతమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటి కనిపించింది. 

అందుకే కలెక్షన్స్ పరంగా ఫ్యామిలీ స్టార్ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై నెల గడవక ముందే ఓటీటీలోకి వచ్చెయ్యబోతుంది అనే ప్రచారం జరిగింది. అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులని ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేయగా.. ఏప్రిల్ 26 నుంచి ఫ్యామిలీ స్టార్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తుంది అనే ప్రచారం జరిగింది. 

ఇప్పుడు అదే గాసిప్‌ని నిజం చేస్తూ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 26న ఫ్యామిలీ స్టార్ స్ట్రీమింగ్‌కి వస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది కాబట్టి.. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణనే పొందే అవకాశం ఉంది.

Family Star Ready to Release in OTT

family star ott