ఏమిటి విజయ్ ఈ సస్పెన్స్
What could be Vijay Devarakonda special?విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి రిలీజ్ మోడ్ లో ఉన్నాడు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖుషి మూవీ ప్రమోషన్స్ చాలా చప్పగా, చాలా నీరసంగా ఉన్నాయి. దానితో ఖుషి ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అటు సమంత అమెరికాలో చక్కర్లు కొడుతోంది, ఇటు విజయ్ దేవరకొండ తనకి తోచిన విధంగా ఖుషిపై హైప్ క్రియేట్ చేసే మూడ్ లో ఉన్నాడు.
తాజాగా తన ఇన్స్టా పేజీ లో ఓ పిక్ పోస్ట్ చేసాడు. అది విజయ్ చేతులో మరో చెయ్యి.. కనిపిస్తుండగా.. విజయ్ ఇలా రాసుకొచ్చాడు.. చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది, త్వరలో ప్రకటిస్తాను అంటూ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు. అసలు విజయ్ ఈ పిక్ పెట్టింది.. ఇన్‌స్టా కథలో రాసింది.. ఆయన వ్యక్తిగత జీవితానికి ఏమైనా సంబంధం ఉందా.. లేదంటే తాను ప్రమోట్ చేసే వాచ్ బ్రాండ్ ని ఇలా ప్రమోట్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడా.. కాదు ఇది అతని కొత్త ప్రాజెక్ట్ గురించా అనేది మాత్రం ఎవరికి అంతుబట్టడం లేదు.
ప్రస్తుతమైతే విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీ తెగ వైరల్ అవుతుంది. ఆ పిక్ పెట్టి.. ట్విట్టర్ లో అప్పుడే నెటిజెన్స్ పజిల్స్ మొదలు పెట్టేసారు. విజయ్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వబోతున్నాడా? లేదంటే అది వాచ్ బ్రాండ్ ప్రమోషనా? లేదు అది అతని కొత్త ప్రాజెక్ట్ గురించా? గెస్ చెయ్యమని పోల్స్ పెడుతున్నారు.
Vijay Devarakonda promises something special







































