ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Again Kangana Ranaut Sensational Comments

నన్ను నాశనం చేసేందుకు మాఫియా..

Again Kangana Ranaut Sensational Comments

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అదో కాంట్రవర్సీ అవుతుంది అనుకుంటే పొరబాటే.. ఆమె మాట్లాడేది కాంట్రవర్సీ క్రియేట్ చెయ్యడానికే తప్ప నార్మల్‌గా మాట్లాడదు. నటిగా ఎంతగా ప్రశంసలు అందుకుంటుందో.. ఇతర విషయాల్లో అంత నెగిటివిటీ మూటగట్టుకుంటుంది. తన సినిమాలు హిట్ అయినా.. తనపై విషం చిమ్మేందుకు ఆ సినిమాలు ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారంటూ కంగనా సోషల్ మీడియా వేదికగా గోడు వెళ్లబోసుకుంటుంది.

తాజాగా తను నటించిన తమిళ సినిమా చంద్రముఖి 2 రిలీజ్ ప్రమోషన్స్‌లో కంగనా బిజీగా ఉంది. రీసెంట్‌గానే చంద్రముఖి 2లో కంగనా లుక్ రిలీజ్ అయ్యింది. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన సినిమాలపై విషం చిమ్మడానికి ఓ మాఫియా తయారైంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన సినిమాల వసూళ్లు గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, అలా ప్రచారం చేసే వారి ఆత్మకి సంతృప్తికలగాలని కామెంట్స్ చేసింది. 

 

తన సినిమాలు 150 కోట్లు కలెక్షన్స్ వచ్చినా ఆ సినిమా ప్లాప్ అనే దుష్ప్రచారం చేస్తూ తనని అణగతొక్కడానికి ట్రై చేసున్నారంటూ మాట్లాడింది. దీని వెనుక ఓ మాఫియా ముఠానే పని చేస్తుంది. ఇతరులని కించపరచడానికి పగలు రాత్రి కష్టపడుతూ ఆలోచనలు చేస్తూ డబ్బులు వృధా చేస్తున్నారు అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది కంగనా రనౌత్.

Mafia Working for Distroy Me Says Kangana Ranaut

kangana ranaut
mafia
sensational comments