టైగర్ నాగేశ్వరావుగా రవితేజ లుక్ కి టైం ఫిక్స్
Tiger Nageswara Rao Look revealing onక్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడనుకున్న రవితేజ మళ్ళీ ట్రాక్ తప్పాడు. ఖిలాడీ, రామ రావు ఆన్ డ్యూటీ సినిమాలు రవితేజకి ఘోరమైన ఫలితాన్నిచ్చాయి. ఇప్పుడు రవితేజ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. ఢమాకా, రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండగా.. మెగాస్టార్ చిరు తో బాబీ డైరెక్ట్ చేస్తున్న Mega154 లో రవితేజ ఓ స్పెషల్ కేరెక్టర్ చేస్తున్నాడు. అయితే వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు నుండి నిన్న రేణు దేశాయ్ హేమలత లవణం లుక్ రివీల్ చేసారు.
స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ లో రవితేజ టైగర్ నాగేశ్వర రావు లుక్ ని విజయదశమి రోజున అంటే అక్టోబర్ 5 న రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రేపు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టైగర్ నాగేశ్వరావు గా రవితేజ ప్రీ లుక్ మాస్ గా సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మరో ఐదు రోజులు వెయిట్ చేస్తే రవితేజ ఫాన్స్ పాన్ ఇండియా లెవల్లో పండగ చేసుకోవచ్చన్నమాట.
Raviteja as Tiger Nageswara Rao Look revealing on Oct 5th






































