రాజమౌళి-మహేష్ అంత త్వరగానా?
Mahesh Babu and SS Rajamouli Combo Movie shooting Updateమహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కబోతున్న SSMB28 షూటింగ్ మొదలు కాకూండానే ఏప్రిల్ 28 2023 రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించేసారు. ఈ నెలలోనే SSMB28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అయితే మహేష్ షూటింగ్ మొదలు పెట్టకుండానే రిలీజ్ డేట్ ఇవ్వడం అంటే విషయం ఉంది అంటూ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. మహేష్ ఆచి తూచి షూటింగ్ చేస్తారు. అస్సలు పరుగులు ఉరుకులు పెట్టరు. కానీ ఇప్పుడు ఎనిమిది నెలల్లో సినిమా రిలీజ్ అంటూ ప్రకటన ఇచ్చేసారు.
అదే ఆశ్చర్యం అంటుంటే.. ఇప్పుడు రాజమౌళి సినిమాని మహేష్ బాబు వెచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే మొదలు పెట్టబోతున్నారట. గతంలో విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీ అప్ డేట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారో రాజమౌళి కూడా ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయే మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. మహేష్ స్క్రిప్ట్ పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుందని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పడంతో మహేష్ ఫన్స్ ఖుషీగా ఉన్నప్పటికి.. మహేష్ త్రివిక్రమ్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చెయ్యాలి.. రాజమౌళి సినిమా సెట్స్ కి ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నారు.
Latest Update on Mahesh Babu and Rajamouli film







































