ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde hikes her remuneration again

పారితోషకం విషయంలో తగ్గేదే లే

Pooja Hegde hikes her remuneration again

ఇప్పుడు లక్కీ హీరోయిన్ కాస్తా ఐరెన్ లెగ్ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే కి వరస ప్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆమెకి చేతినిండా సినిమాలే. విజయ్ దేవరకొండ JGM పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న పూజ హెగ్డే.. పాన్ ఇండియా స్టార్ యశ్ తో మరో సినిమా ఒప్పుకోబోతుంది అనే టాక్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యశ్ తనకి బిగ్గెస్ట్ హిట్ ముప్తీ ని ఇచ్చిన నర్తన్ తో ఓ సినిమా కి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని యశ్ స్వయంగా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో యశ్ తో రొమాన్స్ చెయ్యడానికి పూజ హెగ్డే ని ఎంపిక చేసారు అనే టాక్ ఉంది. కాకపోతే పాన్ ఇండియా స్టార్ లెవల్ ఉన్న యశ్ తో వచ్చిన ఛాన్స్ ఎగిరి గంతేసి పట్టుకోకుండా.. ఈ సినిమాలో నటించడానికి పూజ హెగ్డే భారీగా డిమాండ్ చేస్తుందట. 

ఇప్పటికే పూజ హెగ్డే తో సంప్రదింపుల కార్యక్రమం పూర్తి అయ్యింది అని, పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న పూజ హెగ్డే కి అడిగిన పారితోషకం ఇవ్వడానికి యశ్ కూడా సానుకూలంగా ఉన్నాడనే న్యూస్ వినిపిస్తుంది. JGM లో పూజ హెగ్డే కాలు పెట్టినప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. పూజ హెగ్డే JGM కోసం భారీగా డిమాండ్ చేసింది అని. నిజంగా వరసగా మూడు ప్లాప్స్ ఉన్నా.. పిలిచి అవకాశం ఇస్తే థాంక్స్ చెప్పాల్సింది పోయి పారితోషకం ఇలా డిమాండ్ చెయ్యడం ఏమిటో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Shocking News About Pooja Hegde s Remuneration

pooja hegde
pooja remuneration
jgm
yash movie