పుష్ప ద రూల్ అప్ డేట్ వచ్చేసింది

Pushpa The Rule Update

పుష్ప ద రైజ్ తో సంచలనాలకు తెరలేపిన అల్లు అర్జున్ - సుకుమార్ లు.. ఇప్పుడు పుష్ప ద రూల్ పై మరింత క్రేజ్ పెంచేశారు. పుష్ప పార్ట్ 1 చూసాక పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి స్టార్ట్ అయ్యింది. పుష్ప రాజ్ గా దునియాని అల్లు అర్జున్ ఎలా రూల్ చేస్తాడో.. దానిని భన్వర్ లాల్ ఫహద్ ఫాసిల్ ఎలా అడ్డుకోబోతున్నాడో అనే ఆత్రుత అల్లు ఫాన్స్ లోనే కాదు, ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో ఉంది. పుష్ప పార్ట్ తో కలెక్షన్స్ సునామి సృష్టించడమే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి అల్లు అర్జున్ స్పెషల్ గా ప్రశంశలు అందుకున్నాడు. ఇక జూన్ లోనే పుష్ప పార్ట్ 2 మొదలు కావాల్సి ఉంది.

కానీ జులై నెలాఖరు నుండి పుష్ప ద రూల్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఏడాది సమ్మర్ కానీ లేదంటే దసరాలో కానీ పుష్ప ద రూల్ ని రిలీజ్ చేస్తామని, అలాగే బన్నీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కూడా త్వరలోనే  ఉంటుంది అంటూ బన్నీ వాస్ పుష్ప ద రూల్ పై అప్ డేట్ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఫాన్స్ ఇప్పుడు పుష్ప ద రూల్ ని సోషల్లో మీడియా ట్రెండ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసారు.

Allu Arjun Pushpa The Rule Update

allu arjun
pushpa the rule
allu arjun pushpa the rule
pushpa 2 update