స‌ర్దారూ... సైన్యం!

CineJosh news

అరెవో గ‌బ్బ‌ర్‌సింగ్ కా పోజియో... అన‌గానే ల‌గెత్తుకొని  ఓ బృందం వ‌చ్చేస్తుంది. రాస్కోవ‌డానికి సాంబా, ఇంకేమైనా చెప్తే చేయ‌డానికి మిగ‌తావాళ్లూ వెంట‌నే సిద్ధ‌మైపోతుంటారు. అలా సిద్ధం కాక‌పోతే మాత్రం వాళ్ల లెక్క తేల్చేస్తాడు....  అస‌లే గబ్బ‌ర్‌సింగ్‌కి తిక్క మ‌రీ! అందుకే గ‌బ్బ‌ర్‌సింగ్ సైన్యం ఎప్పుడూ ఆయ‌న వెంటే ఉంటుంది. ఏం చెప్పినా శిర‌సావ‌హిస్తూ త‌లూపుతుంటుంది. గ‌బ్బ‌ర్‌సింగ్ కాస్త స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ అయినా స‌రే... ఆ గ్రూప్ మాత్రం మార‌లేదు. సేమ్ టు సేమ్‌. అదే విన‌యం, అదే విధేయ‌త‌ల‌తో ఇలా స‌ర్దార్ ముందు కూర్చుండిపోయారు. ఇక సారు ఆర్డ‌ర్ వేయ‌డ‌మే ఆల‌స్య‌మ‌న్న‌మాట‌. అన్న‌ట్టు గ‌బ్బ‌ర్‌సింగ్‌కి మాత్ర‌మే కాదండోయ్.. ఆయ‌న సైన్యానికీ కొంచెం తిక్కే. అందుకే అప్పుడ‌ప్పుడు  వాళ్ల‌కి కూడా ఇలా క్లాస్ తీసుకొంటుంటాడ‌న్న‌మాట‌. అస‌లు ఇక్క‌డ ఎలాంటి క్లాస్ తీసుకొంటున్నాడో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. వ‌చ్చే వారంలో పాట‌ల్ని విడుద‌ల చేస్తున్నామ‌ని, ఏప్రిల్ 8న సినిమా వస్తుంద‌ని చెబుతూ చిత్ర నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఈ ఫొటోని పోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో వేసిన ర‌త్త‌న్‌పూర్ సెట్లో ప్ర‌స్తుతం క్లైమాక్స్ స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి. అందులో గ‌బ్బ‌ర్‌సింగ్ పోలీస్ సైన్యంతోపాటు కొద్దిమంది గూండాలు కూడా పాల్గొంటున్నారు. ఆ స‌న్నివేశాలు పూర్త‌యితే ఇక సినిమా పూర్త‌యిన‌ట్టే లెక్క‌. 

sardaar gabbar singh
gabbar singh batch
pawan kalyan
power star pawan kalyan gabbar singh team
ali
shankar
sivaji raja