ఎన్టీఆర్‌కు వరుస హిట్‌లు ఖాయం!

‘టెంపర్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ‘వన్’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. దర్శకుడు సుకుమార్‌పై వున్న నమ్మకంతో ఎన్టీఆర్ సుక్కుతో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ఫెయిల్యూర్‌కు కూడా ఓ గౌరవం వుంటుంది అంటూ సుకుమార్‌పై తన అభిమానాన్ని ఇటీవల మీడియా ముందు వెల్లడించాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్న ఈ చిత్రం కథ, కథనాలు ఎవ్వరూ ఊహించని విధంగా వుంటాయని.. తప్పకుండా ఎన్టీఆర్ కెరీర్‌లో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న ‘జనతా గ్యారేజీ’ సినిమా కథ కూడా చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని, శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ దర్శకత్వలో రానున్న ఈ చిత్రం కూడా సూపర్‌హిట్ ఖాయమని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.. సో.. ఈ రెండు చిత్రాలతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకోబోతున్నారన్నమాట. 

jr ntr
nannaku prematho
janatha garage
sukumar
koratala siva
ntr fans
young tiger