టాక్సిక్ టెన్షన్ రామాయణ పోగొట్టింది
Toxic Steps Aside, Ramayana Gets Breathing Space For Yash
కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత కన్నడ హీరో యశ్ కి పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ పెంచింది. ఆ చిత్రాలు ఆతర్వాత యశ్ నుంచి రాబోయే టాక్సిక్ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ చాలా వెయిట్ చేసారు. కానీ యశ్ టాక్సిక్ చిత్రంతో విపరీతంగా నిరాశపరిచారు. ఆ చిత్రంతో యశ్ ట్రోల్ అయ్యారు.
టాక్సిక్ చిత్రంలో యశ్ రోల్ దగ్గర నుంచి కంటెంట్ వరకు అంతా ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. టాక్సిక్ ట్రోల్స్ నుంచి యశ్ బయటపడి ఆయన రామాయణ చిత్ర ప్రమోషన్స్ లో గ్లోబల్ వైడ్ గా బిజీ అయ్యారు. రామాయణ చిత్రం విడుదలయ్యాక ఆ చిత్రం యశ్ పోషించిన రావణ్ పాత్రకు అన్ని వైపులా నుంచి అదిరిపోయే అప్రిశేషన్స్ వస్తున్నాయి.
రామాయణ చిత్రంలో రాముడిని పొగడాల్సిన ఆడియన్స్ రావణ్ ని పొగుడుతున్నారు. యష్ రావణ్ పాత్రలో లుక్స్ వైజ్ గా, కేరెక్టర్ వైజ్ గా పెరఫార్మెన్స్ వైజ్ గా అద్భుతం అంటూ ఆయన నెగెటివ్ కేరెక్టర్ ని పొగిడిన వారే కానీ, పొగడని వారు లేరు. టాక్సిక్ తో నెగెటివ్ అయినా యశ్ రామాయణతో హైలెట్ అవడంతో ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు అనే చెప్పాలి.
















































