తెలుగులో నిరాశ పరిచిన సూర్య
Scene Telugu Version A Big Disappointment For Suriya
ఈ ఏడాది సూర్య హ్యాట్రిక్ హిట్ కొడతారని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సూర్య కూడా అదే నమ్మకంతో ఉన్నారు. కురుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సూర్య అదే జోరుతో సీన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు. దివాళి ఫెస్టివల్ సందర్భంగా సీన్ తో హిట్ కొట్టాలని సూర్య, ఆయన అభిమానులు కాచుకుని కూర్చున్నారు.
నిన్న శుక్రవారం విడుదలైన సీన్ చిత్రానికి ఉదయం అయితే సోషల్ మీడియాలో అద్భుతమైన టాక్ కనిపించింది. సూర్య, నస్లీన్ పెరఫార్మెన్సు అదుర్స్ అన్నారు, BGM సూపర్ అన్నారు.. సూర్య సీన్ తో హ్యాట్రిక్ కొట్టారు అన్నారు. కట్ చేస్తే సినీవిమర్శకులు సీన్ కి అంత సీన్ లేదు అన్నారు. యావరేజ్ కాదు బిలో యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు.
సీన్ చిత్రం రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ సాగదీత సినిమాకి ఎఫెక్ట్ అయ్యాయి. సూర్య సీన్ తో విజయాల పరంపర కొనసాగిస్తారు, హ్యాట్రిక్ హిట్ సీన్ తో సొంతం చేసుకుంటారని కలలు కన్న అభిమానులకు నిరాశ మిగిల్చారు. ఇక తెలుగులో అయితే సూర్య సీన్ తో బాగా డిజప్పాయింట్ చేసారనే మాట ప్రేక్షకుల నోట వినవస్తుంది.
















































