లెనిన్ కొత్త డేట్ రివీల్ చేసిన నాగ్
Lenin New Release Date Locked
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేది మారింది. ఇప్పుడు సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.
తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని నిర్మాత కింగ్ నాగార్జున తెలియజేశారు. లెనిన్ సినిమాను థియేటర్స్‌లో చూసే ఆడియెన్స్‌కు స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం బెటర్ ఔట్ పుట్ అవసరం. దాని కోసం మరింత సమయం కావాలని, ఎంటైర్ టీమ్ అందుకు కష్టపడుతోందని ఆయన తెలియజేశారు. టీమ్ తమ బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడానికి మరింత టైమ్ కావాలని భావించిన మేకర్స్, రిలీజ్ డేట్‌ను జూలై 10కి మార్చారు. లెనిన్ మూవీలో ప్రేక్షకులు సరికొత్త అఖిల్ అక్కినేనిని చూడబోతున్నారంటూ అక్కినేని నాగార్జున హామీ ఇచ్చారు.
‘లెనిన్’ టీమ్ నా దగ్గరకు ఓ రిక్వెస్ట్‌తో వచ్చారు. వారు తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్‌తో స్పెషల్ మూవీని క్రియేట్ చేయటానికి కాస్త సమయం కావాలని అడిగారు. వారి ప్యాషన్, స్పిరిట్ చూసి నేను ఒప్పుకున్నాను. మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మరోసారి చెబుతున్నాను మీరు ఓ కొత్త అఖిల్‌ను చూస్తారు. గెట్ రెడీ ఫర్ ది లెనిన్ ఎక్స్‌పీరియెన్స్’ అని నాగార్జున పేర్కొన్నారు.








































