ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Chaitanya Shares A Picture From Thandel

తండేల్ నుంచి నాగ చైతన్య లేటెస్ట్ లుక్

Naga Chaitanya Shares A Picture From Thandel

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్. 

తాజాగా హీరో నాగ చైతన్య సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.  

తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు నాగచైతన్య.

Naga Chaitanya Shares A Picture From His Prestigious Project Thandel

naga chaitanya