సుకుమార్ లేకపోతే నేను లేను: బన్నీ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. తన కెరీర్లో సాధించిన విజయం లో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్యా లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులకు థాంక్యూ.. అని తెలిపారు.

పుష్ప సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన. తాజాగా పుష్ప థ్యాంక్యూ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రంలో నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ గారికి థాంక్స్. ఆయన నాలో శ్రీవల్లిని ఎలా చూసాడో తెలియదు. ఏదైనా సినిమా అయిపోతే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కానీ పుష్ప అయిపోతే సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండు నెలల్లో కలిసి పార్ట్ 2 కోసం పని చేయబోతున్నాం కాబట్టి. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. అది నాకు ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు సుకుమార్.. హీరో అల్లు అర్జున్ గారికి థాంక్స్. అని తెలిపారు.

పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్ చాలా ఎమోషనల్‌గా జరిగింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అల్లు అర్జున్ తనకు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. సుకుమార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను..అని తెలిపారు.

Allu Arjun Pushpa Thanks Meet

Pushpa Thanks Meet
allu arjun
pushpa thanks meet
pushpa movie
sukumar
rashmika
devisri prasad
mythri movie makers
muttam setty media
sunil
allu arjun pushpa thanks meet
pushpa success party