ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jagan's Alleged Plan to Incite Violence in Pulivendula

క్యాడర్ ని రెచ్చగొడుతున్న జగన్

Jagan's Alleged Plan to Incite Violence in PulivendulaJagan's Alleged Plan to Incite Violence in Pulivendula


పులివెందులలో కూటమి ఎక్కడ విజయం సాధిస్తుందో అనే కంగారులో జగన్ అరాచక రాజకీయాలకు తెరలేపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడ్డాలో కూటమి అందులోని టీడీపి జెండా ఎగురుతుంది అనే భయంతో జగన్ కేడర్ ని రెచ్చగొడుతూ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగా కష్టపడుతుందో దానిని చెడగొట్టేందుకు వైసీపీ ముఖ్యంగా జగన్ ప్రయత్నం చెయ్యడమే హాట్ టాపిక్ గా మారింది.

పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టి ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరపాలని కూటమి యోచించింది. కానీ జగన్ పులివెందుల వచ్చి మరీ కేడర్ ని ఉసిగొల్పి తన పట్టు సాధించాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపించింది. నామినేషన్ల నాటినుంచే వైసీపీ అధిష్టానం హింసకు దింగింది.

పులివెందులలో పోటీకి కూడా వైసీపీ నేతలు ఆసక్తి చూపకపోవడంతో జగన్ బాగా హార్ట్ అవడమే కాదు తాను పులివెందుల వస్తున్నాను అంటూ క్యాడర్ ను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారు. అంతేకాదు చొక్కాలు మడతపెడతా అంటూ హింసకు వైసీపీ శ్రేణులకు పురిగొల్పిన జగన్.. పులివెందులలో పోలింగ్ రోజు వాహనాలు తగులబెట్టి కొత్త డ్రామాకు తెరలేపారు. తనను అసలు హెలికాఫ్టర్ దిగనివ్వలేదు అంటూ తప్పుడు ప్రచారం చెయ్యడం హాస్యాస్పదం. ముందు పర్మిషన్ తీసుకున్న సమయానికంటే ముందు వచ్చి అనుమతి ఇవ్వలేదు అంటూ డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల రోజు ఎలాంటి అనుమతి లేకపోయినా భారీ వాహనాలతో పులివెందులలో ర్యాలీ మొదలు పెట్టారు.

ఓ పక్క పోలీసులు తమను అడ్డుకుంటున్నారు అంటూ దుష్ప్రచారం చేస్తూనే మరో పక్క చిరు నవ్వులతో క్యాడర్ కు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం తరహా వ్యవహారించారు. కొన్ని చోట్ల ఏజెంట్లను బయటకు పిలిపించుకుని తమ వారిని రానివ్వలేదు అంటూ తప్పుడు ప్రచారం చేసారు. జగన్ ర్యాలీలో వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి రోడ్డెక్కడంతో దాన్ని టీడీపీకి ఆపాదించి గగ్గోలు పెట్టారు.

అసలు పులివెందులలో ఏ అభ్యర్థిపైనా, ఏ ఏజెంట్ పైనా దాడి జరగలేదని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. ప్రశాతంగా పోలింగ్ జరుగితే తమ ఉనికి గల్లంతు అవుతుందని హింసకు దిగేందుకు వైసీపీ వాళ్ళు విశ్వప్రయత్నాలు చేసారు. తనకు సబంధం లేకపోయినా ఆర్వో కార్యాలయానికి ఏజెంట్లతో వెళతానని ప్రకటన చేసారు జగన్. అంతేకాదు పులివెందులలో ఎక్కడ ఓడిపోతామో అని జగన్ అక్కడ రీ పోలింగ్ జరగాలని డిమాండ్ చెయ్యడం గమనార్హం. 
 

Jagan Mohan Reddy