పులివెందులలో వైఎస్ జగన్‍కు షాక్

Dastagiri confronted JaganDastagiri confronted Jagan

 

ఫ్యాక్షన్ ప్రపంచంలో పులివెందులకు పెద్ద పీటవేస్తారు. వైఎస్ రాజశేఖర్ తండ్రి రాజారెడ్డి కాలం నుంచి పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. దానిని కంటిన్యూ చేద్దామని కలలు కన్న జగన్ కు ఇపుడు పెద్ద షాక్ తగిలింది. పులివెందులలో ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది.

పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చిన మాజీ సీఎం జగన్ ర్యాలీ గా వెళ్లేందుకు ప్రయత్నం చెయ్యగా ఆయనకు అడ్డుగా వెళ్లిన వివేకా కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి, సొంత బాబాయ్‍ని చంపించి మా జీవితాలను నాశనం చేశావంటూ వ్యాఖ్యలు చెయ్యడం కలకలం సృష్టించింది. దస్తగిరి వ్యాఖ్యలతో ఖంగుతిన్న జగన్, దస్తగిరిని అసలు చూసీ చూడనట్టు అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం.

మరోపక్క ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ..
• మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల్లో జగన్ మార్క్ మళ్లీ ప్రారంభమైంది.  
• తాను చేసిన పాపాలను ఎదుటివారిపై నెట్టడం – ఇదే జగన్ 2.0 మార్క్.
• అవినాష్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. బాబాయ్ హత్య కేసులో ఏమి జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.  
• ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ నేతలు గలాటా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
• పులివెందులకు వెళ్లి గలాటా చేసే వాళ్లు ఎవరూ లేరు.  
• సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
• ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.  
• పులివెందుల్లో మార్పు వచ్చింది.. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

Big Shock To YS Jagan