ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Minister Nara Lokesh expresses anger over the Guntur incident

గుంటూరు ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం

Minister Nara Lokesh expresses anger over the Guntur incident

 

గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడేనని తేలిన వెంటనే, టీడీపీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజకీయ అనుబంధం లేదా పార్టీ సభ్యత్వం రక్షిస్తుందని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

ఈ నెల 15న గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఇంటి ముందు నీరు పట్టుకుంటున్న మహిళతో టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి గొడవ పడడమే కాకుండా మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుడిపై దాడి చేసి, ఆ మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ దాడికి సంబందించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుంటూరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మట్లాడుతూ.. తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. మహిళను అవమానించడం అంటే సమాజ విలువలను అవమానించినట్లేనని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh Responds over Guntur Women Incident