బంగారాన్ని చూడాలంటే ఓపిక కావాలి
Maa Inti Bangaram streaming on JioHotStar
సమంత రూ.100 కోట్ల సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో దుల్లగొట్టేసింది. ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ఫ్యాన్స్ మా ఇంటి బంగారం చిత్రాన్ని ఆదరించడంతో మా ఇంటి బంగారం థియేటర్స్ లో రూ.100 కోట్లు కొల్లగొట్టింది.
థియేటర్స్ లో హిట్ అయిన మా ఇంటి బంగారం చిత్రం నిన్నటినుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ప్రేక్షకులు వీక్షిద్దామని జియో హాట్ స్టార్ లో ఓపెన్ చేస్తే.. మా ఇంటి బంగారం చిత్రానికి మధ్యన ఉన్న యాడ్స్ ప్రేక్షకుల మూడు, ఉత్సాహం పై నీళ్లు చల్లాయి. ఐదు నిమిషాల సినిమాకి రెండు యాడ్స్ చొప్పున హాట్ స్టార్ ఓటీటీ ఆడియన్స్ ని చిరాకు పెట్టాయి.
మా ఇంటి బంగారం చూద్దామని ఆత్రంగా హాట్ స్టార్ లోకి వెళ్లిన ఆడియన్స్ కి హాట్ స్టార్ వేసిన యాడ్స్ చూసి బంగారాన్ని వీక్షించాలి అంటే చాలా ఓపిక కావాలి.. అరగంటకొక యాడ్ ఉండొచ్చు కానీ.. ఐదునిమిషాలకో యాడ్ అంటే చిరాకు రాక ఇంకేమవుతుంది. మా ఇంటి బంగారం సూపర్ రెస్పాన్స్ తో ఓటీటీ లోకి ఎంటర్ అవడంతో హాట్ స్టార్ దానిని యాడ్స్ తో క్యాష్ చేసుకుంటుందని అంటున్నారు. ఇలా అయితే ఆడియన్స్ డిజప్పాయింట్ అవడం ఖాయం.







































