తృటిలో తప్పించుకున్న కొడాలి నాని

Big Relief for Kodali Nani


గుడివాడ మాజీ ఎమ్యెల్యే, వైసీపీ నేత కొడాలి నాని జైలుకు పోకుండా తృటిలో తప్పించుకున్నారు. గుట్కా కింగ్, బూతు మంత్రి గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని కూటమి ప్రభుత్వంలో కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ లో ఉన్నప్పుడు అధికార మదంతో చేసిన తప్పులు కూటమి ప్రభుత్వంలో మెడకు చుట్టుకుని జైలుకు వెళ్లాల్సిన నానిని..

అనారోగ్య సమస్యలు ఆయన్ని ఒడ్డునపడేసాయి. ఇప్పుడు ఆరోగ్యంగా తిరిగి రాజకీయాల్లో యాక్టీవ్ అవుతున్న తరుణంలో నాని పై 2021 లో ఎన్నికల కమీషన్ వేసిన కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో 801 ని జారీ చేశారు. దానితో కొడాలి నాని అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.

కానీ కొడాలి నాని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దానితో కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సో ఆలా తృటిలో కొడాలి తప్పించుకున్నారు. లేదంటే జైలుకు పోవాల్సి వచ్చేది.

Kodali Nani Gets Partial Relief from AP high court