జగన్ గెలుపు ఆపలేరు!
Another mega survey by poll strategyఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ బలం పెరుగుతుందా? అంటే సర్వేలు అదే చెబుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్నాయి. ఏపీలో జగన్ కి ఓటు మట్టం పెరుగుతోంది.. ఎంతమంది కలిసి ఎన్నిరకాలుగా గ్రూపులు కట్టినా .. కూటములు కట్టినా ఈసారి కూడా జగన్‌ని ఆపడం ఎవరి వాళ్ళ కాదు అంటూ ఇంకో సర్వే తేల్చింది. ఈమధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ - నవ భారత్ చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సైతం మళ్ళీ వైసీపీ కి అనుకూల ఫలితం రావడం వాళ్ళని నిలువనియ్యడం లేదు.
మరోపక్క పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఒకవేళ TDP, జనసేన కలిసివెళ్లినా ? విడివిడిగా వెళ్లినా గెలుపు జగన్ వైపే ఉంటుంది అంటూ ఆ సర్వే తేల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని టిడిపి జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. జనసేన నేత పవన్‌ను 7 శాతం మంది మాత్రమే సీఎం గా చూడాలనుకుంటున్న. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన బాగుందని అధిక శాతం మంది చెప్పగా కొద్దిమంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. 2019తో పోలిస్తే వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.
సంక్షేమ, అభివృద్ధి పథకాలే ప్రాణం
సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలూ.. చిన్నచిన్న వాడల్లోకి సైతం చేరిపోయారు.. పథకాలు పొందిన లబ్ధిదారులు మొత్తం గంపగుత్తగా జగన్ కు జై కొట్టేందుకు రెడీ అవుతున్నారు. దానికితోడు నాడు - నేడు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్య వైద్య రంగాల్లో సాధించిన గణనీయమైన మార్పులు జగన్ ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్ లో ప్లస్ కాబోతున్నాయి.
వారికి పొత్తులే ప్రాణం ...
TDP పొత్తుల కోసం పాకులాడుతున్నా జగన్ మాత్రం సింగిల్ గానే ఆంధ్రని గెలవబోతున్నారనే ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. అటు బిజెపి.. జనసేనలో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. అది సరిగ్గా పొసగడం లేదు.. ఇక బిజెపికి సైతం రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు.. జగన్ మాత్రం ఎవర్నీ నమ్ముకోకుండా అచ్చం ప్రజలతో మాత్రమే మా పొత్తు. మీ ఇంట్లో మేలు జరిగితే.. మీకు మంచి జరిగితే మీ బిడ్డను ఆశీర్వదించండి అనే కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు జగన్‌కు మరోమారు పట్టంగట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెబుతోంది.
CM Jagan Again going to Ruled Ap







































