ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Sudheer faced sudden elimination

BB10: ఆడియన్స్ ఓటింగ్ కి విలువ లేదా?

Bigg Boss 10: Sudheer faced sudden eliminationBigg Boss 10: Sudheer faced sudden elimination


బిగ్ బాస్ లో ఏ సీజన్ లో అయినా ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ నచ్చలేదు అంటే.. ఓట్స్ వెయ్యకుండా ఎలిమినేట్ చెయ్యాలి అని చూస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో ఆ ఆడియన్స్ ఓట్స్ కి అసలు వాల్యూ లేదు అనిపించేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న షాలిని ని ఎలిమినేట్ చేస్తే ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టారు.

ఇక నిన్న సుధీర్ ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది, అతన్ని ముఖేష్ పవర్ వాడి ఝాన్సీ తో సేవ్ చేయించాడు. మరోపక్క జాన్సీ, రామకృష్ణకు ఓటింగ్ లో వీక్ అయ్యారు. అసలు వర్షిణి ని ఆడియన్స్ ఎప్పుడో ఎలిమినేట్ చెయ్యాల్సింది. వర్షిణి ఎన్నోసార్లు డేంజర్ జోన్ లోకి వచ్చింది. కానీ ఎలిమినేట్ అవ్వదు.

ఇప్పుడు గ్రీన్ లెవల్ కి వెళ్లి గోట్ అయ్యింది, మరో రెండు వారాలు ఆమెను ఆడియన్స్ భరించాలి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న రోహిత్, రామకృష్ణ, ఝాన్సీ, వంశి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే క్యూరియాసిటీ నడుస్తుంది. ఈ వారం రెడ్ లో ఉన్న వారిలో రోహిత్, రామకృష్ణలు బయటికి వెళ్లాలి అని ముగ్గురు, ముగ్గురు వారి తలపై బాటిల్స్ పగలగొట్టగా సుధీర్ కి మాత్రం ఒక్క ఓట్ పడింది.

అయినా ఆడియన్స్ ఓటింగ్ తో సుధీర్ ఎలిమినేట్ అవ్వాలి అని బిగ్ బాస్ చెప్పాడు. కానీ ఝాన్సీ అతన్ని కాపాడింది. అందుకే అనేది ఆడియన్స్ ఓటింగ్ కి విలువ లేదా అని. 

Bigg Boss Telugu 10: Sudheer Elimination, but Jhansi uses her elimination-free power