రిలాక్స్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

NTR fans are relaxingNTR fans are relaxing


నిన్నటివరకు ఆదర్శ కుటుంబం పై అంచనాలు లేవు, ఆ సినిమా కి ట్రేడ్ లో బజ్ లేదు అంటూ సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడ్డారు. ఎందుకంటే డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ చెయ్యబోయే నెక్స్ట్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ తీసిన ఆదర్శ కుటుంబం హిట్ అవ్వాలని వారు వెయ్యి దేవుళ్ళకు మొక్కారు.

అక్టోబర్ 30 న విడుదలైన ఆదర్శ కుటుంబానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా ఆడియన్స్ నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఆదర్శ కుటుంబం చిత్రం చూసి సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఆదర్శ కుటుంబం ప్లాప్ అయితే పరిస్థితి ఏమిటి. అదే వారి బాధ.

డ్రాగన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ సెట్ లోకి ఎన్టీఆర్ వెళ్లాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకే వారు ఆదర్శ కుటుంబం రిజల్ట్ కోసం అంత టెన్షన్ పడ్డారు. ఆదర్శ కుటుంబానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సినిమా హిట్ పక్కా అంటున్నారు.

దసరా కి వచ్చిన జైలర్ 2 తర్వాత మంచి సినిమా పడలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. యునానమస్ గా సూపర్ హిట్ టాక్ రాకపోయినా బెటర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Aadarsha Kutumbam Talk: NTR fans are relaxing