BB10: ప్రేమ జంటకు ఇచ్చిపడేసిన నాగార్జున
Bigg Boss Telugu 10: Nagarjuna Fires On Mukesh Mukesh
బిగ్ బాస్ సీజన్ 10లో ప్రేమ పక్షులు గా మారిన రోహిత్, షాలిని జంట ఒకటి, మరోకటి సీరియల్ నటుడు ముఖేష్, యాంకర్ వర్షిణి జంట. రోహిత్, షాలిని బాగా ఎక్స్పోజ్ అయినా.. ముఖేష్, వర్షిణి జంటను బిగ్ బాస్ పెద్దగా ప్రొజెక్ట్ చెయ్యడం లేదు. వర్షిణి ప్రతిసారి బోటం లైన్ కి వెళ్లి సేవ్ అవుతుంది. మొదట్లో ముఖేష్ తన కెప్టెన్సీ త్యాగం చేసి మరీ వర్షిణి ని కాపాడాడు.
గత వారం వర్షిణి - షాలిని బోటం లో ఉంటె వర్షిణి ని సేవ్ చేసి షాలిని ని సీక్రెట్ రూమ్ కి పంపించారు. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి, ఇంకా ముఖేష్ లకు హోస్ట్ నాగార్జున ఎడా పెడా ఇచ్చిపడేసారు. ముఖేష్ నువ్ జెంటిల్మెన్ అనుకున్నా కానీ.. శివ్ తో నువ్వు మాట్లాడిన మాట్లాడు ఎలా ఉన్నాయో తెలుసా, నీతూ ప్రొఫెషన్ పై మాట్లాడడం కూడా బాలేదు.. నువ్వు రోహిత్, త్రిగుణ ని చూసి నేర్చుకున్నావా అని క్లాస్ పీకారు.
ఇక వర్షిణి ని లేపి నువ్ ఎవరినైనా ఛాలెంజ్ చెయ్, అది గేమ్ లో చూపించు, నువ్వు టాస్క్ లో బరువు ఎంత మోసావ్ 12 కేజీలు అని అనగానే మరి నీతూ ని నువ్ ఎం పీకావ్ అన్నావ్, నీతూ పీకి చూపించింది అంటూ వర్షిణి కి క్లాస్ పీకగానే వర్షిణి ఏడ్చేసింది. ఇక రామ్ ప్రసాద్ ని నీకు షాలిని హౌస్ లోకి రావడం నచ్చలేదా అనగానే నచ్చలేదు అని ఓపెన్ గా చెప్పిన ప్రోమో వదిలారు.
















































