ఫౌజీ గ్లింప్స్ పై ట్రోల్స్

Trolls on Fauzi GlimpseTrolls on Fauzi Glimpse

 

పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఊరించి ఊరించి ఫౌజీ మేకర్స్ బర్త్ డే ముగిసిపోతుంది అని ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చిన సమయంలో ఫౌజీ గ్లింప్స్ వదిలారు. ఆ గ్లింప్స్ లో ప్రభాస్ కేరెక్టర్ ని పరిచయం చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి హిట్లర్, అలాగే సుభాష్ చంద్రబోస్ అంటూ కాలయాపన చేసి చివరికి ప్రభాస్ ఫౌజీ కేరెక్టర్ ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసారు.

గ్లింప్స్ లో మొత్తం ప్రభాస్ ఉండాలి కానీ.. మాకీ కేరెక్టర్స్ ఎందుకు అంటూ కాస్త డిజప్పాయింట్ అయ్యారు అభిమానులు. మరోపక్క ప్రభాస్ చేతిలో పెద్ద ఆయుధంతో కనిపించారు. ఒక సాధారణ సైనికుడికి అంత పెద్ద ఆయుధం ఎలా వస్తుంది అని కొంతమంది, ప్రభాస్ ఫౌజీ లుక్ లో నిరాశపరిచారని కొందరు మాట్లాడుతున్నారు.

సుభాష్ చంద్రబోస్ కేరెక్టర్ లో కనిపించిన ఆయన అంబెడ్కర్ లా ఉన్నారని, అలాగే ఫౌజీ తో వేరే స్పై మూవీస్ ని కంపేర్ చేస్తూ కామెంట్స్ చెయ్యడం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యేలా చేసింది.ఈ ఏడాది ఇప్పటికే రాజాసాబ్ అవమానంతో ఉన్న వారికి ఈ ఫౌజీ గ్లింప్స్ ఫీడ్ బ్యాక్ మరింత ఆందోళనకు గురయ్యేలా చేసింది. 

Trolls on Prabhas Fauzi Glimpse