ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ramayana Part 2: Shifted to Diwali 2028!

రామాయణం పార్ట్ 2: దీపావళి 2028కి షిఫ్ట్!

Ramayana Part 2: Shifted to Diwali 2028!Ramayana Part 2: Shifted to Diwali 2028!

బాలీవుడ్ తెరకెక్కుతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం `రామాయణం` గురించి ఓ ఆసక్తికరమైన వార్త  చక్కర్లు కొడుతోంది. నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న  పాన్-ఇండియా చిత్రం మొదటి భాగం నవంబర్ 5, 2026న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట దీపావళి 2027లో విడుదలవుతుందని ప్రకటించిన `రామాయణం: పార్ట్ 2` చిత్రాన్ని మేకర్స్ తాజాగా 2028 దీపావళికి వాయిదా వేసినట్లు సమాచారం.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించాలనే ఉద్దేశంతో నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, హాలీవుడ్ స్థాయికి తగ్గట్టుగా ఉండేందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందట. భారతీయ ఇతిహాస కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడంలో బడ్జెట్ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్  సినిమా స్కేల్‌ను మరింత పెంచినట్లు బాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

`రామాయణం` రెండవ భాగంలోనే ప్రధానమైన రామ-రావణ యుద్ధ ఘట్టాలు హైలెట్ అవుతాయి. ఈ నేప‌థ్యంలో  చిత్రానికి మరింత ఎక్కువ షూటింగ్ సమయం అవసరమని చిత్ర బృందం భావిస్తోంది. దీంతో సినిమా కొత్త విడుదలకు సంబంధించిన అధికారిక తేదీని `రామాయణం: పార్ట్ 1` ఎండ్ క్రెడిట్స్‌లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
 

Ramayana Part 2 Reportedly Moves To Diwali 2028