ప్రెస్ మీట్స్ కోసమే అమరావతి టు బెంగుళూరు
From Amaravathi to Bengaluru, just for press meets2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం గా మారిన జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు ప్యాలెస్ కి పయనమయ్యారు. బెంగుళూరు ప్యాలెస్ లోనే ఉంటూ తమ నేతలెవరైనా తప్పు చేసి జైలుకు వెళితే వారిని పరామర్శించి పోవడానికి తాడేపల్లి వచ్చి వెళ్లడం, లేదంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే అమరావతికి రావడం తప్ప జగన్ ఎక్కువ శాతం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా బెంగుళూరు ప్యాలెస్ లోనే సేద తీరుతున్నాడు.
ఇప్పుడు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు భారీగా నామినేషన్లు దాఖలు చేసాయి. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902నామినేషన్లు దాఖలు కాగా 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయి
చివరి రోజున జెడ్పీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు 3315, ఎంపీటీసీ స్థానాలకు 25016 నామినేషన్లను దాఖలు చేసాయి.
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 22,013 నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్ధులు
• 20,556 నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులు
• జనసేన పార్టీ తరపున 4609 మంది నామినేషన్ల దాఖలు
• బీజేపీ నుంచి 1150 నామినేషన్లు దాఖలయ్యాయి
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున 2078 నామినేషన్లు దాఖలయ్యాయి.
• వైఎస్ఆర్సీపీ నుంచి 1815 మంది నామినేషన్లు వేశారు.
• జనసేన పార్టీ నుంచి 679, బీజేపీ తరపున 255 నామినేషన్లు దాఖలు.
ఏపీలో చాలాచోట్ల ప్రశాంతంగా ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనా... మాజీ సీఎం జగన్ మాత్రం కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం గమనార్హం. అప్పుడుడప్పుడు బెంగళూరు నుంచి రావడం... ప్రెస్ మీట్ పెట్టి హడావిడిగా తప్పుడు ఆరోపణలు చేయడం వెళ్లిపోవడం ఇదీ జగన్ హిట్ అండ్ రన్ థియరీ అంటూ కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేవలం ప్రెస్మీట్లు పెట్టడానికే బెంగళూరు నుంచి అమరావతి వస్తున్నాడు అంటూ ప్రజలు కూడా సైటర్లు వేస్తున్నారు.
















































