ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi release date: Prabhas’ period actioner eyes March 18

ఫౌజీ కొత్త రిలీజ్ డేట్ అదేనా?

Fauzi release date: Prabhas’ period actioner eyes March 18Fauzi release date: Prabhas’ period actioner eyes March 18

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. పలుమార్లు విడుదల తేదీలు మార్చుకుంటూ డిసెంబర్ 3 న విడుదల కావాల్సిన ఫౌజీ చిత్రం, ఆ తేదీ నుంచి కూడా పోస్ట్ పోన్ అయ్యింది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో మేకర్స్ వాయిదా వేశారు.

అయితే  ఫౌజీ షూటింగ్ విషయంలోనూ, రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో అయోమయం నడుస్తుంది. ఫౌజీ నిర్మాత ఫౌజీ విడుదల కాస్త లేట్ అవుతుంది అన్నారు, అది ఎంత లేట్ అనేది క్లారిటీ లేదు. తాజాగా ఫౌజీ చిత్రం 2027 మార్చ్ లో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది.

అది కూడా లాంగ్ వీకెండ్ ని చూజ్ చేసుకుని మార్చి 18 న విడుదల చేస్తే బావుంటుంది అనే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతానికి ఫౌజీ కి సంబందించిన రెండు పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని.. న‌వంబ‌రు 15 నుంచి డిసెంబ‌రు 15 వరకు గ్యాప్ లేకుండా ఫౌజీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. 

Fauzi update