బీసీలకు అండగా తెలుగుదేశం
TDP pledges BC reservations
టీడీపీ బీసీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టపరంగా లేదా న్యాయపరంగా ఇబ్బందులు ఎదురైనా, పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు కచ్చితంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేస్తాం – ఇది మా విధానం!
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో తెలుగు దేశం పార్టీ కట్టుబడి ఉంది.
గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేసేలా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో. 105, జీవో 1065 తెచ్చాం.
దీనిపై గొడ్డలి పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. వైసీపీ కోర్టుకు వెళ్లిన కారణంగానే హైకోర్టులో కొట్టేశారు.
అయినా వెనక్కి తగ్గకుండా సుప్రీం కోర్టుకు వెళ్లాం. స్వయంగా బీసీ మంత్రులు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించారు. సుప్రీం కోర్టులో విజయం సాధించడానికి సీనియర్ అడ్వకేట్లను నియమించాం.
అయితే దురదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు 34 శాతం రిజర్వేషన్ల ను అనుమతించలేదు.
అయినా సరే....బీసీల విషయంలో మేం వెనక్కి తగ్గం. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పార్టీ తరుపున అమలు చేస్తాం.
బీసీల రాజకీయ గౌరవాన్ని కాపాడుతాం..... స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిథ్యం పెంచుతాం.
చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తాం.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తాం. 34 శాతం తగ్గకుండా సీట్లు బీసీ వర్గాలకు కేటాయిస్తాం అని ప్రకటిస్తున్నాం.
బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది.
బీసీలకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యం.. వారి హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరి.
గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లి, కుట్రలు చేసి మళ్లీ మాపై ఆరోపణలు చేస్తోంది.
నాడు హైకోర్టు రిజర్వేషన్లు కొట్టేస్తే అధికారంలో ఉన్న వైసీపీ కనీస ప్రయత్నం చేయలేదు.
బీసీలకు అండగా తెలుగుదేశం
బీసీలకు రాజ్యాధికారం అని తొలి సారి మాట్లాడింది... అవకాశాలు కల్పించింది తెలుగుదేశం.
తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కారణంగా 4 దశాబ్దాల క్రితమే బీసీ గళం, స్వరం వినిపించింది.
తరువాత కాలంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాం. 1995లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల 34 శాతానికి పెంచాం.
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా ఉన్నారనే అక్కసుతో బీసీలను అణగదొక్కారు.
వారి పాపాలు, తప్పులు అంతటితో ఆగలేదు. బీసీలపై కక్షతో, పగతో 30 ఏళ్ల నుంచి ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. దీంతో 16,800 మంది పదవులు కోల్పోయారు.
బీసీలకుమేలు చేసింది మేమే:
బీసీ ఫెడరేషన్లకు నాంది పలికింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. బీసీలు అంటే కులవృత్తులు.
చేతి వృత్తులు. వాటిని పరిరక్షించేందుకు, వారి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వ పరంగా ఆదరణ వంటి పథకాలను తీసుకువచ్చాం.
ఆదరణ పథకం కింద 341 రకాల పనిముట్లను 90% సబ్సిడీతో అందించారు.
కూటమి అధికారంలోకి వచ్చాక... బీసీల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. మా ఆలోచన ఒక్కటే....
వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు... గీత కార్మికులకు 10శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించాం.
నేతన్న సేవలో కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25,000 వేలు సాయం చేస్తున్నాం.
హ్యాండ్లూమ్ మగ్గాలకు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం.
వేట నిషేధ సమయంలో మత్స్య కారులకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని నేనే తీసుకువచ్చాను. దాన్ని మరింత పెంచి ముందుకు తీసుకువెళ్లాం.
మత్స్యకారుల సేవలో పథకంతో వేట విరామం సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తున్నాం. సబ్సిడీలో బోట్లు, డీజిల్ ఇస్తున్నాం. తీర ప్రాంతంలో వేటపై హక్కులకు రక్షణ కల్పిస్తున్నాం.
గత ప్రభుత్వం అన్యాయంగా తెచ్చిన జీవో నెంబర్ 217 రద్దు చేసి మత్స్యకార సొసైటీల హక్కుల కాపాడాం.
మత్స్య కార మహిళలకు సీ వీడ్ పెంపకంపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం.
నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ తీసుకువచ్చాం.
అలాగే దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు భృతిని రూ.15 వేల నుంచి రూ.25,000కు పెంచాం.
మళ్లీ చెపుతున్నాం....బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల లబ్ది ని రాజకీయంగా అమలు చేసి చూపుతాం.
















































