విశ్వనాథ్ కి తమిళ కష్టాలు
Vishwanath And Sons: Hit in Telugu, Struggling in Tamil
తెలుగు దర్శకులు తమిళ హీరోలను డైరెక్ట్ చేస్తే.. కోలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాని చూడరా? బావుంది అన్నా పట్టించుకోరా.. తెలుగు దర్శకులపై తమిళ ఆడియన్స్ కు చిన్న చూపా? లేదంటే తెలుగు దర్శకులు తీసిన సినిమాలు అంటే కోపమా? ఇదే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
రీసెంట్ గా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాల్లో తెలుగులో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకుంటే తమిళనాట ఆ చిత్రానికి డిజాస్టర్ కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే విశ్వనాథ్ అండ్ సన్స్ వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే అందులో మేజర్ కలెక్షన్స్ తెలుగులోనే వచ్చాయి.
హీరో సూర్య తమిళ్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుని విశ్వనాథ్ ని ఆదరిస్తే తమ హీరో అయినప్పటికీ తమిళ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూడలేదు అంటే ఏమనుకోవాలి. తమిళనాట కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ అయితే ఈపాటికే రూ.200 కోట్లు ఈ చిత్రం కొల్లగొట్టేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమిళనాట విశ్వనాథ్ ని ఆడియన్స్ గాలికొదిలేశారు.







































