టికెట్ ధరల హైక్ పై తెలంగాణ ట్విస్ట్
TG GO To Four Filma Producers To Pay 20 Percent From Ticket Hike Revenue
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎంల దగ్గరకు నిర్మాతలు వెళ్లడం.. వాళ్ళు కూడా టికెట్ రేట్ల పెంపుకు సముఖంగా జీవో లు విడుదల చెయ్యడం చూస్తున్నాము. టికెట్ రేట్ల పెంపు ఏపీలో సజావుగా సాగుతుంటే.. తెలంగాణలో మాత్రం కోర్టు కేసులంటూ హడావిడి జరుగుతుంది.
అయితే తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20%ను సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలి అని సరికొత్తగా ఆదేశాలు జారీ చేసింది.
గతంలో టికెట్ రేట్లు పెంచిన సినిమాలు అంటే.. అఖండ 2, రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు,పెద్ది చిత్రాల నిర్మాతలకు, సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా తమ తమ ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అదనపు ఆదాయంలో వర్తించే 20% మొత్తాన్ని వసూలు చేసి, ఆ మొత్తాన్ని TGFDC జమ చెయ్యాలని ఆదేశించింది.
TGFDC ద్వారా నిర్వహించబడుతున్న ఖాతాలో, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు/సూచనలకు అనుగుణంగా పూర్తిగా జమ చేయడానికి అధికారం ఇవ్వబడుతోంది. సో టికెట్ రేట్లు పెంచుకోమంటే పండగ చేసుకునే నిర్మాతలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై నిర్మాతలుటికెట్ రేట్లు పెంచుకునే సాహసం చెయ్యరు. ఆ విధంగా ప్రేక్షకులు లాభపడతారు.







































