ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara Speech at Toxic Trailer Launch Event

పాన్ ఇండియాకైతే సెంటిమెంట్ లేదా నయన్

Nayanthara Speech at Toxic Trailer Launch Event


మాములుగా లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల ప్రమోషన్స్ లో కనిపించడం చాలా అరుదు. కాదు కాదు సెంటిమెంట్ అంటూ నయనతార ఏ సినిమా ప్రమోషన్స్ కి రాదు. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి నయన్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చి ఓ వీడియో ప్రమోషన్ చేయించారని టాక్ ఉంది.

అయితే గత రాత్రి నయనతార తన సెంటిమెంట్ ని పక్కన పెట్టింది, అలాగే తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసి ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ప్రమోషన్స్ లో కనిపించింది. అది చూసిన వారు పాన్ ఇండియా మూవీస్ కి సెంటిమెంట్ లేదా నయన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ ఈవెంట్ లో నయనతార తానెందుకు టాక్సిక్ ఒప్పుకున్నానో అనేది రివీల్ చేసింది. తనకి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఫోన్ చేసినప్పుడు ఈ చిత్రంలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఎక్కువ మంది స్టార్లు ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి కొంచెం భయపడతాను. కారణం నా స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుంది, అందుకే నేను ఈ సినిమా చేయలేను అని చెప్పేశాను.

కానీ వదలకుండా గీతూ నన్ను ప్రశ్నించారు, దానితో కథ వినడానికి ఒప్పుకున్నాను, కథ విన్న తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంత గొప్ప దర్శకురాలిని మనం ఇప్పటివరకూ ఎందుకు చూడలేదు అనిపించింది. హీరో యశ్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తన లైఫ్ లో 4,5 ఏళ్ల కష్టాన్ని, సమయాన్ని ధారపోశారు. తన కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత సంతోషాలను పక్కనపెట్టి సినిమా కోసమే జీవించారు అంటూ నయనతార టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.
 

Nayanthara's Special Words for Yash