నాని పక్కన రూ.100 కోట్ల హీరోయిన్

Bhagyashri Borse for Nani Bloody RomeBhagyashri Borse for Nani Bloody Rome

 

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ ని విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గా ది ప్యారడైజ్ నుంచి వచ్చిన టీజర్ కి మిశ్రమ స్పందన కనిపించింది. ది ప్యారడైజ టీజర్ లో మరీ వయలెన్స్ ఎక్కువైంది అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టుగా టీజర్ తో పాటుగా డేట్ లాక్ చేసారు మేకర్స్.

ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాగానే నాని ఇమ్మిడియట్ గా అక్టోబర్ నుంచి సుజిత్ తో చెయ్యాల్సిన బ్లడీ రోమియా సెట్ లోకి వెళ్ళిపోతారని తెలుస్తుంది. సుజిత్ కూడా OG 2వెనక్కి వెళ్లడంతో నాని బ్లడీ రోమియా ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. అయితే ఈ చిత్రంలో నాని కి జోడిగా రూ.100 కోట్ల హీరోయిన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట సుజిత్.

రీసెంట్ గానే లెనిన్ చిత్రంతో  భాగ్యశ్రీ బోర్సే రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న భాగ్యశ్రీ బోర్సే అయితే నాని సరసన అయితే బావుంటుంది సుజిత్ ఆలోచన చేస్తున్నాడట. నేడో రేపో భాగ్యశ్రీ బోర్సే పేరు ఫైనల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తుంది. 
 

Bhagyashri Borse in Nani’s Next?