రెండో రోజు కుమ్మేసిన కొరియన్ దెయ్యం
Korean Kanakaraju Second Day Collections
పాజిటివ్ టాక్ తో మొదటిరోజు రూ.10 కోట్లు కొల్లగొట్టిన కొరియన్ దెయ్యం అదేనండీ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రెండోరోజు కుమ్మేసింది. వరుణ్ తేజ్ సినిమా అప్పుడే అంటే రెండు రోజులకే రూ.23 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో రెండోరోజు మరిన్ని స్క్రీన్ యాడ్ అయ్యాయి.
దానితో మొదటి రోజుకన్నా మూడు కోట్ల గ్రాస్ కొరియన్ కనకరాజు కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కొరియన్ కనకరాజు కి రెండు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.23.6 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ తో ప్రకటించారు. ఇక తెలంగాణాలో ఈరోజు రేపు కూడా కొరియన్ కనకరాజుదే హవా కనిపిస్తుంది.
లాంగ్ వీకెండ్ లో కొరియన్ కనకరాజ్ ఆల్మోస్ట్ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కొడుతోంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం కొరియన్ దెయ్యం ఫస్ట్ వీకెండ్ లో ఎంత కొల్లగొడుతుందో చూద్దాం.







































