వైజాగ్ కి అల్లు అర్జున్

AlluArjun coming to Vizag

 

ఈరోజు ఆదివారం విశాఖపట్నంలో AAA ఓపెనింగ్ కోసం అల్లు అర్జున్ వైజాగ్ వెళుతున్నారు. మరికాసేపట్లో ఆయన విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఆయన అభిమానులు విశాఖ ఎయిర్ పోర్ట్ కి భారీగా చేరుకున్నారు. దానితో పోలీసులు రంగంలోకి దిగారు.

అల్లు అర్జున్ ని ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా ఇనార్బిట్ మాల్ కి తీసుకెళ్లాలని అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ కి అనుమతి లేదు అని చెప్పడంతో అభిమానులు ఆందోళనకు దిగారు.

విశాఖపట్నం ఇనార్బిట్ మాల్ లో నిర్మించిన AAA ని అల్లు అర్జున్ ఓపెన్ చెయ్యనున్నారు. భారీ హంగులతో ఈ థియేటర్ నిర్మాణం చేపట్టారు. అల్లు అర్జున్ మరికాసేపట్లో దానిని ఓపెన్ చెయ్యడానికి వైజాగ్ వెళుతున్నారు.
 

Allu Arjun is scheduled to visit Visakhapatnam