బ్లాక్ బస్టర్ ని మిస్ అయిన టాలీవుడ్ హీరో

Vijay Deverakonda Missed Blockbuster


కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కిన డీసీ చిత్రం కోసం ముందుగా అనుకున్నది దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని కాదట. ముందు ఓ టాలీవుడ్ హీరో కి ఈ డీసీ కథ చెప్పగా ఆయన రిజెక్ట్ చెయ్యడంతో లోకేష్ కనగరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ డీసీ తో ఆడియన్స్ ముందుకు వచ్ఛాడు. ఎలాంటి అంచనాలు లేకుండా డీసీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మరి అంత మంచి కథను, ఆడియన్స్ మెచ్చిన స్క్రిప్ట్ ను వదులుకున్న ఆ టాలీవుడ్ ఎవరు అనుకుంటున్నారా. ఆయనే విజయ్ దేవరకొండ కొండ. వరస వైఫల్యతో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ దగ్గరకే ఈ డీసీ కథ రాగా ఆయన రిజక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఇప్పుడు అదే కథ తో లోకేష్ కనగరాజ్ హీరో గా ఫస్ట్ హిట్ కొట్టేసాడు. దర్శకుడిగానే కాదు, లోకేష్ ఇప్పుడు హీరోగాను ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా విజయ్ దేవరకొండ డీసీ ని గనక రిజెక్ట్ చేసినట్లయితే ఆయన మంచి హిట్ ని మిస్ అయినట్లే కదా.!

Did Vijay Deverakonda miss DC?