ఆగష్టు ఫస్ట్ వీక్: ఇంట్రెస్టింగ్ రిజల్ట్
August First week : Interesting result
ఆగష్టు ఫస్ట్ వీక్ వచ్చేసింది. జులై లో లెనిన్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఆగష్టు స్టార్ట్ అయ్యింది. మొదటి వారంలో చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీపడ్డాయి. అందులో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ప్రమోషన్స్ తో వరుణ్ తేజ్-రితిక నాయక్, మేర్లపాక గాంధీ ల కొరియన్ కనకరాజ్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.
క్రిటిక్స్, ఆడియన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించినా కొరియన్ కనకరాజ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో కొత్త స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. కామెడీగా వర్కౌట్ అయ్యింది, ఇది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఈ శుక్రవారమే విడుదలైన లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రానికి విడుదలకు ముందు ఎలాంటి పాజిటివ్ బజ్ కనిపించలేదు.
కానీ సినిమా విడుదలయ్యాక కోలీవుడ్ నుంచి సూపర్ హిట్ రివ్యూస్ వచ్చేసాయి. తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ చిత్రం డీసీ కి మంచి రెస్పాన్స్ కనిపించడమే కాదు చాలామంది సినిమా బావుంది, అనిరుద్ BGM అదుర్స్ అంటున్నారు. ఇక ఈ వారం విడుదలైన మరో చిత్రం దీక్షిత్ శెట్టి KJQ. కింగ్ జాకీ క్వీన్. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఆగష్టు మొదటి వారం, లాంగ్ వీకెండ్ ఈ శుక్రవారం విడుదలైన చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్, ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఎంత హెల్ప్ అవుతాయో అనేది ఈ వీకెండ్ గడిస్తేనే కానీ తెలియదు.







































