ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mini Mathur recalls getting botox 15 years ago

న‌టి జీవితంలో అతి పెద్ద త‌ప్పుతో మొత్తం తారుమారు!

Mini Mathur recalls getting botox 15 years ago

నటి, మోడల్ , టెలివిజన్ హోస్ట్  మినీ మాథుర్  సౌందర్య చికిత్సల అనుభవాల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 15 సంవత్సరాల క్రితం తాను మొదటిసారిగా బాటాక్స్  చేయించుకున్నానని, అది తన జీవితంలో తీసుకున్న అత్యంత చెడ్డ నిర్ణయమని పేర్కొన్నారు. కఠినమైన షూటింగ్ సమయంలో తన నుదిటిపై పడిన ముడతలను సరిదిద్దే ఉద్దేశంతో వైద్యుల సలహా మేరకు కాస్మొటిక్ ప్రొసీజర్‌ను ఎంచుకున్నట్లు ఆమె వెల్లడించారు.

అయితే ఆ నిర్ణయం తనకు తీవ్ర నిరాశను మిగిల్చిందని మినీ మాథుర్ తెలిపారు. బాటాక్స్ కారణంగా తన ముఖ కవళికలు పూర్తిగా స్తంభించిపోయాయని, తాను సంతోషంగా ఉన్నా లేదా బాధగా ఉన్నా ముఖంలో ఎలాంటి హావభావాలు ప్రదర్శించలేకపోయానని వాపోయారు. తాను నటిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితి ఎదురుకావడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఎవరూ తనకు  కాస్మొటిక్ చికిత్స వల్ల ముఖ కవళికలు నిలిచిపోతాయని ముందుగా చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. అదృష్టవశాత్తూ ఆ ప్రభావం మూడు నెలల తర్వాత తొలగిపోవడంతో  ఊపిరి పీల్చుకున్నారు.

సౌందర్య ప్రమాణాలు, కాస్మొటిక్ సర్జరీలపై ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూనే ఎవరి శరీరంపై ఎలాంటి ప్రయోగాలు చేయాలనేది వారి వ్యక్తిగత ఎంపిక అని మినీ మాథుర్ స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియా ప్రభావంతో నేటి యువత  చిన్న వయసులోనే ఇలాంటి బాటాక్స్ వంటి ప్రొసీజర్స్‌కు వెళ్లడం వల్ల భవిష్యత్తులో ముఖం వృద్ధాప్య ఛాయలకు గురయ్యే తీరు మారుతుందని హెచ్చరించారు. ఈ అనుభవం తర్వాత వ్యక్తిగత ఎంపికల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని.. ఎవరికి నచ్చినట్లు వారు ఉండటమే సరైనదని  అభి ప్రాయపడ్డారు.

Mini Mathur on the thin line between strategy and dirty gameplay