సంచ‌ల‌న ప్రాంచైజీకి ఆయ‌న క‌న్ప‌మ్!

Hera Pheri Franchise

 

బాలీవుడ్ కల్ట్ కామెడీ ఫ్రాంచైజీ అయిన `హేరా ఫెరీ` మూడో భాగంపై కొన్ని సంవత్సరాలుగా అనేక వార్తలు వ‌స్తోన్న‌ విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావెల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కబోయే  ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుల మార్పుపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వస్తున్న రూమర్లపై ఖాన్ క్లారిటీ ఇచ్చారు. చిత్రం ఎప్పుడు పట్టాలెక్కినా తాను ఆ ప్రాజెక్ట్‌లో కచ్చితంగా భాగమవుతానని  స్పష్టం చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌తో తనకున్న‌ అనుబంధం గురించి అహ్మద్ ఖాన్ స్పందించారు. మేకర్స్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు జరిగినా తాను అందులో ఉంటున్నట్లు తెలిపారు.
అదీ ద‌ర్శ‌క‌త్వం కావొచ్చు. మ‌రో ర‌కంగా కావొచ్చు. దీనిపై అధికారికంగా  నిర్మాత‌లు క్లారిటీ ఇస్తారు.`హేరా ఫెరీ` లాంటి దిగ్గజ కామెడీ ఫ్రాంచైజీకి సీక్వెల్ అనగానే ప్రేక్షకులలో  అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని.. అందుకే ఈ చిత్రాన్నితామంతా ఎంతో బాధ్యతగా భావిస్తున్నట్లు  పేర్కొన్నారు.

ప్రస్తుతానికి  ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. సరైన సమయం వచ్చినప్పుడు నిర్మాత‌లు  అఫీషియల్ అప్‌డేట్ ఇస్తారని అహ్మద్ ఖాన్ తెలిపారు. అక్షయ్ కుమార్ .. ఇతర ప్రధాన తారాగణం కాంబినేషన్‌లో రానున్న సినిమా కోసం కామెడీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అహ్మద్ ఖాన్ తాజా ప్రకటనతో `హేరా ఫెరీ 3` సినిమాపై నెలకొన్న సందిగ్ధతకు కొంతవరకు తెరపడినట్లయింది.

Hera Pheri 3