పెళ్లి రూమర్లపై హ్యూమా ఖురేషి క్లారిటీ
Huma Qureshi finally reacts to wedding rumoursబాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి వ్యక్తిగత జీవితం పై వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. యాక్టింగ్ కోచ్ రాచిత్ సింగ్తో లవ్ లో ఉన్నారని...త్వరలోనే వివాహం వివాహం జరుగుతుందని సోషల్ మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కథనాలపై హ్యూమా ఖురేషీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టి అంతా వృత్తిపరమైన బాధ్యతలపైనే ఉందని..పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని పేర్కొన్నారు.
పెళ్లి ఎప్పుడు జరగాలంటే? అప్పుడు జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పని లేదన్నారు. ఇటీవల హ్యూమా ఖురేషీ `బేబీ డూ డై డూ` అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఈ కొత్త ప్రయాణం గురించి మాట్లాడారు. ఇది ఒక సవాలుతో కూడుకున్న పని. నిర్మాణంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఒక నటిగా పరిమితమైన బాధ్యతలు ఉంటాయని.. కానీ నిర్మాతగా సినిమా వెనుక జరిగే అనేక ప్రక్రియలను, కష్టాలను అర్థం చేసుకోవడం తనను మరింత పరిణతి చెందేలా చేసిందని అభిప్రాయపడ్డారు.
తమకు నచ్చిన కథలను ఎంచుకునే స్వేచ్ఛ కోసం ..అవకాశాల కోసం ఎదురు చూడకుండా తామే సొంతంగా అవకాశాలను సృష్టించుకోవాలనే ఉద్దేశంతో `సలీమ్ సిబ్లింగ్స్` అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ఆమె వివరించారు. కథలో సత్తా ఉంటే తక్కువ బడ్జెట్లో కూడా అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించవచ్చని హ్యూమా బలంగా నమ్ముతున్నారు.







































